పేదలకు పూర్తి హక్కులతో ఇళ్ల స్థలాల కన్వేయన్స్ డీడ్ లను ఇస్తున్నామని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి తెలిపారు.
మంగళవారం నాడు అమరావతి నుండి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కార్యాచరణ మార్గదర్శకాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె తహసీల్దార్లు జాయింట్ సబ్ రిజిస్టార్ గా వ్యవహరిస్తారని, ఆ మేరకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున తహసిల్దారు ఇళ్ల స్థలాన్ని అర్హులైన లబ్ధిదారునికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారని తెలిపారు.
తహశీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించి, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని తెలిపారు.
ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై సాంకేతిక విధివిధానాలపై కూలంకుషంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ కమిషనర్ హరి నారాయణ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.