చేయి చేయి కలిపి గిరిజనాభివృద్ధికి కృషి


రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి


> పి.ఓలు వినూత్నంగా ఆలోచించండి >


గిరిజనాభివృద్ధికి వేలాది కోట్ల వ్యయం >


విశాఖపట్నం , ఫిబ్రవరి 25: అందరం చేయి చేయి కలిపి గిరిజనాభి వృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పిలుపు నిచ్చారు. గిరిజన సంక్షేమ శాఖకు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులే మూలస్తంభాలని పేర్కొన్నారు. గిరిజనాభివృద్ధిలో విజయాలు, వైఫల్యాలకు పి.ఓ.లే ప్రధానమని స్పష్టం చేసారు. మంగళవారం స్థానిక హోటలో ఐ.టి.డి.ఎ. పి.ఓ లు, సబ్ కలెక్టర్లు, ఉపసంచాలకులు, జిల్లా గిరిజన సంక్షేమాధికారులు, గిరిజన సహకార సంస్థ అధికారులతో గిరిజన సంక్షేమ శాఖలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలుగు, గిరిజన సంక్షేమ శాఖ (విద్య) వై ఎస్.ఆర్ పెళ్లికానుక, అమ్మఒడి, జగనన్న వసతి దీవెల, అటవీ హక్కుల చట్టం అమలు, జగనన్న విద్యాదీవెన పై విస్తృతంగా చర్చించారు.